Header Banner

ఫాస్ట్ ట్యాగ్ నిలిపివేసిన టీటీడీ.. టోల్ చెల్లింపుల్లో గందరగోళం! అలిపిరి టోల్‌గేట్‌పై భక్తుల ఆగ్రహం!

  Sat Feb 15, 2025 14:53        Others

తిరుమల అలిపిరి టోల్‌గేట్‌లో ఫాస్ట్‌ ట్యాగ్ (Fast Tag) సిస్టం పనిచేయడం లేదు. దీంతో టోల్ ఫీజుకు నగదు తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిబ్బంది.. ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలని చెబుతున్నారు. సిబ్బంది నిర్వాకంతో వెంకన్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజులుగా ఇదే తంతు నడుస్తున్నా టీటీడీ పట్టించుకోవడంతో లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా అలిపిరి భద్రతా వలయం వద్ద వారి వాహనాలను తనిఖీలు చేసుకున్న అనంతరం టోల్‌గేట్‌లో ఫీజు కట్టిన తరువాత తిరమలకు వెళ్లాల్సి ఉంటుంది. అందులో భాగంగా గతంలో నేరుగా డబ్బులు వసూలు చేసిన టీటీడీ.. కొంత కాలంగా ఫాస్ట్‌ ట్యాగ్ విధానం రూపంలో వాహనదారుల వద్ద టోల్‌ ఫీజును వసూలు చేస్తోంది.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!


అయితే గత వారం రోజులుగా ఫాస్ట్‌ ట్యాగ్ సిస్టంలో తలెత్తిన లోపాల కారణంగా ఫాస్ట్‌ ట్యాగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. ఫోన్‌ పే ద్వారా భక్తుల నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తోంది టీటీడీ. అయితే చాలా మంది భక్తులు వారి వద్ద ఫోన్ పే లేకపోవడంతో టోల్ ఫీజు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడున్న టోల్‌గేట్‌ సిబ్బందికి తమ వద్ద ఫోన్‌పే లేదని చెప్పటినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా.. భక్తులతో టోల్‌గేట్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఫోన్ పే ద్వారా డబ్బులు కడితేనే వాహనాలను అనుమతిస్తామని, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను భక్తులు అక్కడి భద్రతా సిబ్బందికి చెబుతున్నప్పటికీ వారు స్పందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



వేరే భక్తుల వద్ద ఉన్న ఫోన్ పే ద్వారా తమ టోల్ ఫీజును కట్టి తిరుమలకు బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి ఏర్పడినప్పటికీ టీటీడీ అధికారులు ఎవరూ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రతీ వాహనానికి ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతీఒక్క భక్తుడి వాహనానికి ఫాస్ట్‌ ట్యాగ్ ఉండటంతో టోల్‌‌ గేట్‌ వద్దకు వస్తున్న సమయంలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్‌ఫీజు వసూలు చేస్తే భక్తులకు సులభతరంగా ఉంటుంది. కానీ వారం రోజులుగా ఫాస్ట్ ట్యాగ్‌కు బదులుగా ఫోన్‌ పే విధానంతో టోల్ ఫీజు వసూలు చేస్తుండటంతో భక్తులు ఇబ్బందులకు గురవడమే కాకుండా టోల్‌గేట్ వద్ద చాలా సేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

 

ఇలాంటి నీచుడిని ఏమి చేయాలితలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. ఆ తర్వాత అత్యాచారం - ఏపీలో షాకింగ్ సంఘటన!

 

వాలంటైన్స్ డే.. ముసలోడి ప్రేమ ముదిరిపోయిందిగా.. దివ్వెల‌.. దువ్వాడ.. ఈ ప్రేమ‌జంట‌ వీడియోపై ఓ లుక్కేయండి!

 

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #tollgate #fasttag #problem #thirumala #thirupathi #todaynews #flashnews #latestupdate